Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Defence Ministry: రక్షణ రంగానికి భారీ ఊతం.. రూ.2.12 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
By Eenadu1 min read at Eenadu
In brief
The Defence Ministry has approved military equipment procurement proposals worth Rs.
2.12 lakh crore to strengthen the capabilities of the Indian armed forces.
The Defence Acquisition Council, chaired by Defence Minister Rajnath Singh, approved the procurement of items such as light multi-role helicopters, long-range suicide drones, and radars, with 82% of the procurement expected to be done domestically.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: భారత త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.12 లక్షల కోట్ల వ్యయంతో సైనిక సామగ్రి కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన సమావేశమైన ‘రక్షణ కొనుగోళ్ల మండలి’ (DAC).. సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తేలికపాటి మల్టీరోల్ హెలికాప్టర్లు, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్లు, రాడార్ల వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కొనుగోళ్లలో 82 శాతం దేశీయంగానే చేయనున్నారు.
భారత సైన్యం కోసం తేలికపాటి మల్టీరోల్ హెలికాప్టర్లు, అతి స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ (VSHORADS), దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్ల వంటి ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు డీఏసీ ఆమోదముద్ర వేసింది. నౌకాదళం కోసం ‘యాక్టివ్ ఆఫ్బోర్డ్ డెకాయ్ సిస్టమ్’ (AODS), ఇతర వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం లభించింది. శత్రువుల నౌకా విధ్వంసక క్షిపణుల నుంచి రక్షణ కల్పించడంలో ఏఓడీఎస్ సాయపడుతుందని రక్షణశాఖ తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)
