Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Delimitation Bill: మా నిర్ణయాన్ని చెప్పేందుకే అమిత్ షాను కలిశాం: కనిమొళి
By Eenadu1 min read at Eenadu
In brief
డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై తెలియజేశామని చెప్పారు.
ఈ బిల్లు వల్ల తమిళనాడు నుంచి ఎన్నికయ్యే ఎంపీల సంఖ్య 39 నుంచి 59కి పెరుగుతుందని, అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా అమలులోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Delimitation Bill | దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డీఎంకే ఎంపీలు సమావేశమయ్యారు. డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆయన్ను కలిసి చెప్పామని డీఎంకే ఎంపీ కనిమొళి వెల్లడించారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ ఉదయం మా నాయకుడు ఎంకే స్టాలిన్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. అందులో డీలిమిటేషన్ బిల్లు పట్ల మా వైఖరిపై ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఒక ప్రకటన కూడా విడుదల చేశాం. ఆ నిర్ణయాన్ని హోంమంత్రికి తెలియజేసేందుకే ఇక్కడికి వచ్చాం’’ అని అన్నారు.
మరోవైపు, తమిళనాడు ప్రాతినిధ్యం, మహిళా రిజర్వేషన్ల అంశంపై కనిమొళి మాట్లాడుతూ.. గతంలో తాము చేసిన ప్రతిపాదనలను కేంద్రం కొత్త బిల్లులో చేర్చిందన్నారు. బిల్లు ఆమోదంతో తమిళనాడు నుంచి ఎన్నికయ్యే ఎంపీల సంఖ్య 39 నుంచి 59కి పెరుగుతుందన్నారు. అలాగే, ఈ బిల్లు ఆమోదం పొందాక మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)