Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
DEO Ramesh | సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది : డీఈవో రమేశ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that DEO Ramesh spoke at a felicitation ceremony for the retirement of Karunakar Reddy, a retired Headmaster and MEO of Dhulimitta High School in Siddipet district.
He praised the teaching profession as sacred and commended the retired official's contributions to the school and the community.
The event also featured cultural programs by students and was attended by various local officials, retired teachers, and village elders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మద్దూరు (ధూళిమిట్ట): సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ( Teaching profession ) ఎంతో పవిత్రమైనదని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ ( DEO Ramesh) అన్నారు. ధూళిమిట్ట హైస్కూల్లో గెజిటెడ్ హెచ్ఎం, ఎంఈవో అనుముల కరుణాకర్ రెడ్డి ( Karunakar reddy ) ఉద్యోగ విరమణకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి అవసరమైన మానవ వనరులను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉత్తమ సేవలు అందించడం ద్వారానే ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గెజిటెడ్ హెచ్ఎంగా, ఎంఈవో కరుణాకర్ రెడ్డి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రధానంగా ధూళిమిట్ట హైస్కూల్ అభివృద్ధి కోసం చూపిన చొరవ అభినందనీయమన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం చిలుక వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించిన సన్మాన సభలో రిటైర్డు డీఈవో శ్రీనివాస్ రెడ్డి , సర్పంచ్ గునుకుల లీలాజగన్మోహన్ రెడ్డి , మద్దూరు ఎంఈవో వరదరాజు, విశ్రాంత ఉపాధ్యాయులు తిగుళ్ళ సుధాకరశర్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)