Eenadu
Dhanush speaks about Sreeleela: ఆమె అద్భుతమైన డ్యాన్సర్ : ధనుష్
Entertainment — not analysed for political framing
ఇంటర్నెట్ డెస్క్: ధనుష్ (Dhanush) హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓం’ (OM Movie). నవంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి, శ్రీలీల ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ మాట్లాడారు. శ్రీలీల (Sreeleela) గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె అద్భుతమైన డ్యాన్సర్ అని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా ఆమెలోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూస్తారని తెలిపారు.
‘‘శ్రీలీలకి 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచే నాకు తెలుసు. ఆమె మా కుటుంబ స్నేహితురాలు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అందుకే అంతా ఆమెను డ్యాన్స్ క్వీన్‌గా పిలుస్తారు. పక్కన హీరో ఉన్నా.. తన డ్యాన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తుంది. అయితే శ్రీలీలలో ఆ టాలెంట్ మాత్రమే కాదు.. అంతకుమించిన ప్రతిభ ఉంది. ఆ భిన్న కోణాన్ని చూపించడానికి సరైన అవకాశం రాలేదంతే. ఈ సినిమాలో మీరు శ్రీలీలను సరికొత్తగా చూస్తారు. ఆమె ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే తొలి అడుగు ‘ఓం’ అవుతుంది’’ అని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)