Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dharmaram | బైక్ లను చోరీ చేసిన అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ వివిధ జిల్లాలలో బైక్ లను చోరీ చేసిన కండ్లే బాపన్న అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
మంగళవారం ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు బాపన్నను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నిందితుడి నుంచి సుమారు 10 బైక్ లను స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ పంపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Dharmaram | ధర్మారం, నవంబర్ 10 : వివిధ జిల్లాలలో బైక్ లను చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు పెద్దపెల్లి ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లో విలేకరులకు చోరీ సంఘటన వివరాలను ఏసిపి వివరించారు. ఆయన కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన కండ్లే బాపన్న అనే వ్యక్తి కూలి నాలీ చేస్తూ భార్య పిల్లలతో జీవనం గడిపేవాడు. కూలి పని చేయడం వలన సరైన సంపాదన ఉండదని గ్రహించిన బాపన్న ప్రవృత్తిగా బైక్ చోరీ చేయడం అలవాటు పడ్డాడు. గతంలో వివిధ జిల్లాలలో చోరీ చేసిన సంఘటనలు ఉన్నాయి.
ఇటీవల నంది మేడారం గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి తన బైక్ చోరీ అయిందని ఇచ్చిన ఫిర్యాదు పై పెద్దపల్లి సీఐ కె ప్రవీణ్ కుమార్, ధర్మారం ఎస్సై ఎంబడి శ్రీకాంత్ తో పాటు పలువురు పోలీస్ బృందం అప్రమత్తమై చోరీ చేదించడంపై దృష్టి పెట్టారు. దీంతో మంగళవారం మండల కేంద్రానికి అనుబంధంగా ఉన్న జక్కన్న పల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో బాపన్న అనే వ్యక్తి బైక్ ను చోరి చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీపీ కృష్ణ వెల్లడించారు. బాపన్నను విచారించగా తాను చేసిన దొంగతనాలను అంగీకరించినట్లు ఆయన వివరించారు. నిందితుడు బాపన్న కోరుట్ల నుంచి జగిత్యాల, కరీంనగర్ హైవే రోడ్డు, కరీంనగర్ నుంచి లక్షట్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)