Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
The article provides health advice for parents on preventing and treating diaper rash, especially during the rainy season, by keeping the baby's skin dry and using home remedies like coconut oil.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Diaper Rash | ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. డైపర్లు వాడటం తప్పనిసరిగా మారింది. అయితే, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది.. చిన్నారుల్లో ర్యాషెస్ రావడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా, సున్నితమైన చర్మం, 24 గంటలూ డైపర్లు వాడే పిల్లల్ని ఈ సమస్య అధికంగా వేధిస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పిల్లల చర్మాన్ని పొడిగా ఉంచడం ముఖ్యం. అందుకే, వారు టాయిలెట్ చేసిన వెంటనే.. డైపర్‌ను మార్చేయాలి.
మూత్ర విసర్జన చేసినా, చేయకపోయినా.. ప్రతి రెండుమూడు గంటలకు ఒకసారి డైపర్ మార్చడం మంచి పద్ధతి. ఇక డైపర్‌ను మార్చేటప్పుడు.. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. సున్నితమైన కాటన్‌తో తుడిచి.. శరీర అవయవాలకు గాలి తగిలేలా కాసేపు అలాగే వదిలేయాలి. చర్మం పూర్తిగా పొడిబారిన తర్వాతే కొత్త డైపర్ వేయాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు తడి వల్ల, వాతావరణంలోని తేమ వల్ల కూడా పిల్లలకు ర్యాషెస్ రావొచ్చు. అలాంటప్పుడు ఆయా ప్రదేశాల్లో కొబ్బరి నూనెను రాస్తే.. మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో పోషకాలు, యాంటి మైక్రోబియల్ గుణాలు పుష్కలం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)