Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
డిసెంబర్ 15లోపు వింటర్ సెషన్!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల డిసెంబర్ 15 లోపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్టు పీటీఐ తెలిపింది.
ఆ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దని ఆయన తన మంత్రివర్గ సహచరులను కోరినట్టు వెల్లడించింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అవసరమైన మెజారిటీకి ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి అని కూడా ఆ వార్త పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, నవంబర్ 25: వచ్చే నెల 15 లోపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించినట్టు పీటీఐ తెలిపింది. ఆ తేదీలోగా పార్లమెంట్ సమావేశాల ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆలోపు విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులను కోరినట్టు వెల్లడించింది. తేదీలు, సమావేశాల కాలవ్యవధిపై పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడ్డ మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా ఉండే అవకాశం ఉన్నది. లోక్సభ, అసెంబ్లీ సీట్ల పునర్విభజన ప్రతిపాదనపై చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తదుపరి పార్లమెంట్ సమావేశాలపై చర్చ జరిగినట్టు పీటీఐ తెలిపింది. తమ తమ మంత్రిత్వ శాఖలు సమావేశాలకు సిద్ధంగా ఉండేలా చూడాలని మంత్రులను ప్రధానమంత్రి కోరారు. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదాపడిన వర్షాకాల సమావేశాలను ఇంకా అధికారికంగా ముగించలేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)