Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏదుల నుంచే డిండికి నీళ్లు.. అచ్చంపేట లిఫ్ట్‌కూ జలాలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Chief Minister Revanth Reddy directed irrigation department officials to source water for the Dindi and Achampet lift irrigation projects from the Yedula reservoir.
He also instructed them to prepare for upcoming discussions with the Maharashtra government regarding the Tammidihatti barrage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ప్రాజెక్టుకు నీళ్లను తరలించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని కూడా అక్కడి నుంచే చేపట్టాలని స్పష్టం చేశారు. రెండు లిఫ్ట్‌లకు కావాల్సిన 0.6 టీఎంసీల జలాలను, అదనంగా శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఎత్తిపోసుకొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రు లు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. తమ్మిడిహట్టి బరాజ్‌తోపాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీటముడిగా ఉన్న అంశాలన్నింటిపై చర్చించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉండాలని, త్వరలోనే చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల తెలిపారని వెల్లడించారు. ఆ చర్చలకు సంబంధించిన వివరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఇటీవల ఢిల్లీలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)