Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Electra EL9: ఈ విమానం టేకాఫ్‌కు.. 150 అడుగుల రన్‌వే చాలట..
By Eenadu2 min read at Eenadu
In brief
అమెరికాకు చెందిన ఎలెక్ట్రా (Electra) సంస్థ 'ఈఎల్9 అల్ట్రా షార్ట్' అనే సరికొత్త హైబ్రిడ్ విమానాన్ని తయారు చేస్తోంది, ఇది కేవలం 150 అడుగుల రన్‌వేతో టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయగలదని సంస్థ చెబుతోంది.
ఈ విమానం తొమ్మిది మంది ప్రయాణికులను 560 కిలోమీటర్లకు పైగా తీసుకువెళ్లగలదని మరియు 2030 నాటికి వాణిజ్య సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సీఈఓ మార్క్ అలెన్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: హెలికాప్టర్ లాంటి సౌలభ్యం.. విమానం లాంటి సామర్థ్యాలతో అమెరికాకు చెందిన ‘ఎలెక్ట్రా’ విమానయాన సంస్థ ‘ఈఎల్9 అల్ట్రా షార్ట్’ అనే సరికొత్త హైబ్రిడ్ విమానాన్ని తయారు చేస్తోంది. ఇటీవల న్యూయార్క్ సిటీలో రెండు సీట్లతో కూడిన ప్రొటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది. సాధారణ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు పెద్ద రన్వేలు అవసరం. కానీ.. ఈఎల్9 టేకాఫ్, ల్యాండింగ్‌కు కేవలం 150 అడుగుల రన్‌వే చాలట. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ వినియోగం నేపథ్యంలో ఇది చాలా తక్కువ శబ్దంతో ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
పెద్ద పెద్ద విమానాశ్రయాలపై ఆధారపడకుండా.. నేరుగా గమ్యస్థానాల మధ్యే రాకపోకలు సాగించేలా ‘డైరెక్ట్ ఏవియేషన్’ అనే ప్రాంతీయ ప్రయాణ విధానాన్ని ఎలెక్ట్రా ముందుకు తెచ్చింది. రోజూ దాదాపు 3.5 కోట్ల మంది అమెరికన్లు 80 కి.మీ. నుంచి 800 కి.మీ మధ్యే రాకపోకలు సాగిస్తున్నారని గుర్తించింది. తమ హైబ్రిడ్ ఎయిర్‌క్రాఫ్ట్ (EL9 Ultra Short) అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గనుందని తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)