Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎల్లూరు రిజర్వాయర్‌కు నీళ్లు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Former minister Singireddy Niranjan Reddy stated that the water flow from the Narlapur reservoir to the Yellur reservoir under the Palamuru-Rangareddy lift irrigation scheme was a decision taken during the BRS regime.
He claimed credit for initiating the project by requesting KCR and challenged Minister Jupally Krishna Rao to a debate on irrigation matters.
He also accused the Congress government of deliberately stalling the project since coming to power and demanded the immediate removal of clay in Package 3 of the Srisailam project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు సాగునీరు రావడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేసిన తూము, తాను నాడు కేసీఆర్‌ను కోరి పెట్టించడం వల్లే ఏర్పాటయిందని గుర్తుచేశారు. ఈ పథకానికి సంబంధించి సాగునీటి అంశాలపై మంత్రి జూపల్లి విసిరిన సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సరిదిద్దిందని పేరొన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో పుషలంగా నీరు ఉన్నందున, ప్రభుత్వం ప్యాకేజీ 3లో అడ్డంకిగా ఉన్న మట్టిని తొలగించి వెంటనే నీటిని పారించాలని డిమాండ్ చేశారు. ప్రతి రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటిని నింపే వీలుందని, మిగిలిన పనులను వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి పాలమూరు – రంగారెడ్డి పనులను ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నదని, గతంలో ఇచ్చిన కాలువల టెండర్లను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని హితవు పలికారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)