Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎనీ టైమ్ మిల్క్.. స్వైప్ కరో.. దూద్ భరో
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Raju Pilanagoyina, who started a hotel in Gajal but faced an accident, developed an ATM-style machine to dispense pure milk in Gajal.
He collects milk from local farmers in surrounding villages and delivers it to residents using swipe cards or cash.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నాకు ఐదేండ్ల వయసులోనే మా నాన్న కాలం చేశారు. మా అమ్మ రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ నన్ను, చెల్లిని చదవించింది. మాకోసం అమ్మ పడిన కష్టాన్ని చూసి చాలాసార్లు బాధపడేవాణ్ని. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే త్వరగా సెటిల్ అవుతారని తెలిసి పదో తరగతి పూర్తికాగానే ఆ కోర్సులో చేరాను. అమ్మకు భారం కావొద్దని చదువుకుంటూనే పార్ట్‌టైం క్యాటరింగ్‌లు చేసేవాణ్ని. నన్ను నేను నిరూపించుకునేందుకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే క్యాటరింగ్ డబ్బులతోపాటు అమ్మ సహకారంతో గజ్వేల్‌లో అరేబియన్ మండి హోటల్ ప్రారంభించాను. చాలామంది నానా రకాలుగా మాట్లాడారు. ఇంత చదువుకొని వంటలు చేయడమేంటని ఎగతాళి చేశారు. వాళ్ల బాధకు ఏడాదిలోపే ఆ హోటల్…
అలా మొదలైంది చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మా ఇంటి సమీపంలో ఉండే మెకానిక్‌తో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆయన చాలా బాధపడుతుంటే వెళ్లి విషయం అడిగాను. తన ఎనిమిదేండ్ల కొడుకు కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడని, వైద్యం చేయించడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అంత చిన్న అబ్బాయికి ఇంత పెద్ద సమస్యేమిటా అనిపించింది. ఆ అబ్బాయి ఏం తినే పదార్థాల గురించి వాకబు చేశాను. నాకెందుకో ప్యాకెట్ పాలమీద అనుమానం వచ్చింది. అప్పటికే హోటల్ మేనెజ్మెంట్ చేసిన అనుభవంతో మనం తినే ఆహారంపై అవగాహన ఉంది. ప్యాకెట్ పాల వాడకం కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెడుతుందని గ్రహించాను. నా ప్రాణాలు కాపాడిన గజ్వేల్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)