Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ ఎన్నికలు : పులివెందులలో వైసీపీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
- Tension prevailed in Pulivendula, Kadapa district, as vehicles belonging to YSR Congress Party (YSRCP) candidates were set on fire and attacks were made on their houses during the local body elections in Andhra Pradesh. YSRCP MP Avinash Reddy visited the victims, blamed the TDP for orchestrating the attacks out of election fear, and criticized the police for negligence and favoring the ruling party.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ ఇంకా తగ్గలేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నామినేషన్ల ఉప సంహరణకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. నామినేషన్లు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఇళ్లపై అర్థరాత్రి జరిగాయి. 2026, అక్టోబర్ 20వ తేదీ రాత్రి పులివెందులలోని 33, 31వ వార్డుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఇళ్లపై దాడులు జరిగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు దుండగులు. విషయం తెలిసిన వెంటనే కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డి బాధితులను పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వైఎస్సార్సీపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య లారీలు, బైక్‌లపై పెట్రోల్ పోసి నిప్పంటించారని.. 31వ వార్డు అభ్యర్థి అంజనప్ప ఇంటిపై బీరు సీసాలతో దాడి చేశారంటూ వీడియోలు, ఫొటోలు విడుదల చేశారు. ఈ ఘటనపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైసీపీ అభ్యర్థుల ఆస్తులపై దాడులకు దిగుతున్నారంటూ ఆరోపించారాయన. నామినేషన్ల దశలో పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించారని.. ఇప్పుడు నామినేషన్లు ఆమోదం పొందిన అభ్యర్థుల ఆస్తులపై దాడులు చేయడం