Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏపీలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Local body election nominations in Andhra Pradesh are facing violent disruptions, with YSRCP candidates' papers being torn in Badvel and Proddatur. Former CM Y.S. Jagan Mohan Reddy held a press conference to condemn the violence, accusing the TDP-led government and police of targeting his party candidates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బద్వేల్, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో వైసీపీ వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేశారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు. కాగా, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చంద్రబాబు సర్కార్ అరాచకానికి పాల్పడుతున్నదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా లు చోట్ల జరుగుతున్న విధ్వంసకాండపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టం, న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆగడాలు రోజు రోజేకు మితిమీరిపోతున్నాయని పేర్కొన్నారు. కనీసం నామినేషన్ల కూడా వేయనివ్వడం లేదు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కనీసం నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎందుకు అరెస్ట్లు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.