Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో డీలిమిటేషన్ మరియు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను ప్రవేశపెట్టింది.
ఈ బిల్లుల ఆమోదం ద్వారా దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగవచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఏ రాష్ట్రం కూడా సీట్లను నష్టపోదని ప్రభుత్వం వాదిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆరోపించారు, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ మహిళా కోటాకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
న్యూఢిల్లీ, నవంబర్ 28: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, విపక్ష ఇండియా కూటమికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చెలరేగే అవకాశం కనపడుతున్నది. ఈ బిల్లుల ఆమోదంతో దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగవచ్చని బీజేపీ యోచిస్తున్నదని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మహిళలకు వారి కోటా త్వరగా లభిస్తుందని, ఏ రాష్ట్రం కూడా సీట్లను నష్టపోదని వాదిస్తున్నది.లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచేందుకు ప్రభుత్వం ఏప్రిల్లో బిల్లులను ప్రవేశపెట్టింది.
ఇందులో రాష్ర్టాలకు 816, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించారు. ఈ బిల్లుకు మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం కాగా ఏప్రిల్ 17న అది విఫలమైంది. ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తున్నది.కాగా లోక్సభ సీట్లను 543 వద్దే ఉంచాలని, ఈ సీట్లలోనే మహిళా కోటాను కేటాయించాలని, అలాగే ప్రతి రాష్ట్ర వాటాను 25 ఏండ్ల పాటు స్తంభింపచేయాలని ఇండియా కూటమి కోరుతున్నది. బీజేపీ ఉత్తర భారతంలో అత్యంత బలంగా ఉన్నది. దక్షిణాదిలో 129 సీట్లకు గాను ఆ పార్టీ కేవలం 29 సీట్లను మాత్రమే కలిగి ఉంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)