Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎవరితోనూ శత్రుత్వం లేదు.. నన్ను ఎందుకు టార్గెట్ చేశారో తెల్వదు: టైగర్ ష్రాఫ్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Bollywood actor Tiger Shroff responded to a shooting incident in Mumbai's Juhu area, stating he has no known enemies and that skipping a fan photo session might have saved his life. Three suspects were arrested in Kota, Rajasthan, in connection with the attack. Maharashtra Chief Minister Fadnavis and Deputy Chief Minister Eknath Shinde have ordered strict action and directed officials to provide security to the actor.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ముంబై: తనపై జరిగిన కాల్పుల ఘటనపై బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ స్పందించారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణహాని బెదిరింపులు రాలేదని తెలిపాడు. తనకు ఎవరితోనూ దీర్ఘకాలిక శత్రుత్వం లేదని.. అసలు తనను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో తెలియదని చెప్పాడు. సాధారణంగా వీకెండ్స్‌లో ఫుట్‌బాల్ ఆడిన తర్వాత అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతానని.. అయితే ఆదివారం (అక్టోబర్ 18) అలసిపోవడం వల్ల ఫోటో సెషన్‌కు దూరంగా ఉన్నానని వివరించాడు. ఈ నిర్ణయమే తన ప్రాణాలను కాపాడి ఉండవచ్చని ష్రాఫ్ అభిప్రాయపడ్డాడు.
కాగా, ఆదివారం (అక్టోబర్ 18) సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్ ఆడి కారులో వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపారు. ఈ ప్రమాదం నుంచి ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా.. అతని డ్రైవర్ గాయపడ్డాడు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తోన్న ముగ్గురు వ్యక్తులను రాజస్థాన్‌లోని కోటాలో అరెస్ట్ చేశారు.