Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Expired medicines | వ్యవసాయ బావిలో గడువుతీరిన ప్రభుత్వ మందులు.. కోరుట్లలో భారీ ఎత్తున బయటపడ్డ మందులు, వ్యర్థాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On November 5 in Korutla, a large quantity of expired government medicines, medical waste, and syringes was discovered dumped in an agricultural well.
The local community expressed anger over the environmental threat and alleged the waste was improperly disposed of by nearby government hospitals.
Residents are demanding an official investigation and strict action against those responsible.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Expired medicines | కోరుట్ల, నవంబర్ 5 : కోరుట్ల పట్టణం అయ్యప్ప గుట్ట సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో గడువు తీరిన ప్రభుత్వ మందులు, వైద్య వ్యర్థాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించాల్సిన లక్షలాది రూపాయల విలువైన గడువు ముగిసిన మందుల డబ్బాలు, సూదులు, గ్లౌజులు వంటి బయో వ్యర్ధాలు వ్యవసాయ బావిలో ప్రత్యక్షం కావడంతో స్థానికంగా రేపింది. తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసినట్టుగా ముద్రలు, బ్యాచ్ నంబర్లు కలిగిన మందులను గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి పారవేసినట్లుగా తెలుస్తోంది.
సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి లేదా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మందుల లేక ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడవేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోని మందులను ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇష్టా రీతిలో పడవేయడం ద్వారా పర్యవరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. గడువుతీరిన మందులను ప్రత్యేక పద్ధతుల్లో తరలించాల్సి ఉండగా ఇలా నిర్లక్ష్య పూరితంగా వ్యవసాయ బావిలో పడేయటం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)