Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
An explosion occurred on the fifth floor of a partially constructed multi-story building in Pulakeshinagar, Bengaluru, injuring two workers.
Police suspect an IED was detonated and have launched an investigation, with forensic analysis pending.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఐఈడీ పేలినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Explosion In Building) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళవారం పులకేశినగర్ ప్రాంతంలోని జార్మియా రోడ్డు వద్ద నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నివాస భవనం ఐదో అంతస్తులో పేలుడు జరిగింది. ఇద్దరు కార్మికులకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఆసుపత్రి వర్గాల ద్వారా ఈ పేలుడు సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ (ఐఎస్డీ), బాంబు నిర్వీర్య దళానికి చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ లభించిన పేలుడు వస్తువులను సేకరించారు. విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)