Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
France: కదం తొక్కిన నిరసనకారులు.. పారిస్‌లో లక్షమందికి పైగా ప్రదర్శన
By Eenadu||1 min read at Eenadu
In brief
Thousands of protesters gathered in Paris, France, against rising living costs, despite authorities restricting the route.
Police used tear gas and water cannons to disperse the crowds, and similar protests occurred in other French cities.
Interior Affairs Minister Laurent Nuñez announced that 70,000 security personnel were deployed nationwide.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో నిరసనకారులు కదం తొక్కారు. ఒక్క పారిస్‌లోనే లక్ష మందికిపైగా ప్రజలు ప్రదర్శన (Paris Protest)లో పాల్గొన్నారు. నగర కేంద్రానికి దూరంగా ఉండే మార్గంలోనే నిరసన తెలపాలని అధికారులు ఆంక్షలు విధించినప్పటికీ.. పెద్దఎత్తున స్థానికులు గుమిగూడారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. లియోన్, క్లెర్మాంట్- ఫెర్రాండ్, స్ట్రాస్‌బర్గ్, నీస్, మార్సెయిల్ తదితర నగరాల్లోనూ నిరసనలు జరిగాయి.
విపరీతంగా పెరుగుతున్న జీవన వ్యయాలను నిరసిస్తూ.. పాఠశాలలకు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 70 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి లారెంట్ నునెజ్ వెల్లడించారు. పారిస్‌లో నిరసన ప్రదర్శనకు సంబంధించి 64 మందిని పోలీసులు అరెస్టు చేశారని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)