Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Residents of Gautampur village are facing severe difficulties due to the lack of basic amenities at the local graveyard, including a non-functional hand pump and a damaged access road.
The community is requesting the relevant authorities to carry out repairs and construct a CC road to alleviate these issues during funeral ceremonies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
చుంచుపల్లి, నవంబర్ 05 : గౌతమ్ పూర్ గ్రామంలోని స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఎదుర్కొంటున్నారు. గతంలోనే స్మశాన వాటికలో చేతిపంపు పని చేయడం లేదు. చేతి పంపు చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి నిరుపయోగంగా మారింది. దానికి మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. దీపావళి సందర్భంగా గతించిన తమ ఆత్మీయులను స్మరించుకునేందుకు బంధువులు సమాధుల వద్దకు వెళ్లి శుభ్రం చేసి, నీటితో అలికి దీపాలు వెలిగించి నివాళులర్పిస్తారు. అయితే స్మశాన వాటికలో నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎవరైనా మృతి చెందినప్పుడు ఖననం చేసేందుకు లేదా దహన సంస్కారాలు…
మరోవైపు స్మశాన వాటికకు వెళ్లే రహదారికి సీసీ రోడ్డు లేకపోవడంతో రహదారి ఎత్తుపల్లాలుగా, ఎగుడుదిగుడుగా ఉండి ట్రాలీలు, ఇతర వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారింది. అత్యవసర సమయంలో మృతదేహాలను తరలించేందుకు కూడా అవస్థలు తప్పడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి చేతిపంపునకు మరమ్మతులు చేపట్టి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు స్మశాన వాటికకు సీసీ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. స్మశాన వాటికలో కనీస సదుపాయాలు కల్పించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)