Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Giridih Bank Loot: పట్టపగలే బ్యాంకు దోపిడీ.. తుపాకులు ఎక్కుపెట్టి రూ.4 కోట్ల సొమ్ము కాజేసి
By Eenadu1 min read at Eenadu
In brief
According to the police, five masked men armed with firearms robbed a bank in Dhanwar market, Giridih district, Jharkhand, making off with ₹3-4 crore worth of gold and cash.
The perpetrators taped up the staff and a manager before escaping with the money and the CCTV DVR.
Police have registered a case and seized the two motorcycles used by the suspects.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: పట్టపగలే బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ముఖానికి ముసుగు ధరించి చొరబడిన .. తుపాకులతో బెదిరించి రూ.3-4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు కాజేశారు. ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా ధన్వర్ మార్కెట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిదుగురు నిందితులు రెండు బైక్‌లపై బ్యాంకుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఒకరు హెల్మెట్, మరో నలుగురు ముసుగు ధరించారు. అందరి వద్ద తుపాకులు ఉన్నాయి. తొలుత బ్రాంచ్ మేనేజర్ క్యాబిన్లోకి చొరబడిన దుండగులు.. ఆయనపైకి తుపాకీ ఎక్కుపెట్టారు.
అనంతరం సిబ్బంది, వినియోగదారులందరినీ ఒకచోటికి చేర్చి.. వారందరి ముఖాలు, చేతులకు టేపులు చుట్టారు. మేనేజర్ నుంచి లాకర్ తాళాలు లాక్కుని.. బంగారం, నగదు తీసుకుని ఉడాయించారు. సీసీటీవీ డీవీఆర్నూ వెంట తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ చోరీ జరగడం గమనార్హం. బ్యాంకు సిబ్బంది ప్రాథమిక అంచనాల ప్రకారం.. రూ.3-4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల మేర నగదు చోరీకి గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు వినియోగించిన రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)