Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గోదావరిఖనిలో అర్ధరాత్రి యువకుని హత్య.. పథకం ప్రకారం పిలిపించి హతం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని పవర్ హౌస్ కాలనీలో అట్ల రాజశేఖర్ (32) అనే యువకుడిని దుండగులు అర్ధరాత్రి వేటకొడవలితో అతి క్రూరంగా హత్య చేశారు.
స్థానిక ఆటో డ్రైవర్ పై దాడి చేయడంతో పాత కక్ష్యాల కారణంగా ఈ హత్య జరిగిందని స్థానికుల కథనం ప్రకారం పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు మృతదేహాన్ని ఖని ప్రభుత్వ దావఖానాకు తరలించి, సంఘటన స్థలంలో ఒక విరిగిన కత్తిని స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఫెర్టిలైజర్ సిటీ (పెద్దపల్లి జిల్లా) :పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నగర శివారులోని పవర్ హౌస్ కాలనీలోని శివాలయం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి అదే కాలనీ కి చెందిన అట్ల రాజశేఖర్ (32) అనే యువకుడిని దుండగులు హతమార్చారు. స్థానికుల కథనం ప్రకారం..అట్ల రాజశేఖర్ సింగరేణి ఇందారం ఖని (ఐ.కె.వన్)లో తన తండ్రి వారసత్వ ఉద్యోగం చేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే రాజశేఖర్ రాంనగర్ కు చెందిన ఓ ఆటో డ్రైవర్ ని వారం క్రితం చితక బాదాడు. దీంతో సదరు ఆటో డ్రైవర్ మరో ముగ్గురు యువకులతో కలిసి హత్యకు పథకం పన్నాడు. దీంతో బీరు తాగిస్తామని నమ్మించి ఫోన్ చేసి…
దీంతో రాజశేఖర్ మరో యువకునితో కలిసి తన ఇంటి నుంచి శివాలయం వరకు రాగానే మాటువేసిన నలుగురు దుండగులు వేటకొడవలితో, కత్తులతో దాడిచేసి అతి క్రూరంగా హత్య చేశారు. అనంతరం తాపీగా అక్కడినుంచి ఉడాయించారు. అయితే పాత కక్ష్యలే ఈ దారుణ హత్యకు కారణంగా పోలీస్ లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ ఇంచార్జ్ సీఐ లింగమూర్తి పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరి మృత దేహాన్ని ఖని ప్రభుత్వ దవాకానకు తరలించారు. సంఘటన స్థలంలో ఓ విరిగిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)