Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Godavarikhani | త్వరలో రాజేష్ థియేటర్ జంక్షన్ వెడల్పు చేస్తాం.. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Ramagundam Mayor Mahankali Swamy inspected development works in the 49th division of Godavarikhani, including the widening of Rajesh Theater junction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 23 : గోదావరిఖని రాజేష్ థియేటర్ వద్ద గల జంక్షన్ వెడల్పు పనులను శుక్రవారం రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు వెంటనే తరలించాలని ఎన్పీడీసీఎల్ అధికారులను కోరారు. శుక్రవారం 49వ డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. శారదానగర్ లో స్తంభాలు వేసి విద్యుత్ తీగలు బిగించలేదని గమనించి ట్రాన్స్ కో అధికారులను పిలిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ తీగలకు ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు.
సీఎస్ఆర్ నిధులు సుమారు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ పనుల్లో భాగంగా మార్కండేయ కాలనీ ఫైర్ స్టేషన్ ప్రక్కన నుంచి శారదానగర్ వాటర్ ట్యాంక్ ప్రహరీ వెంబడి ప్రధాన రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం మార్కండేయ కాలనీ రోడ్డు జంక్షన్ వెడల్పు పనులను పరిశీలించారు. డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కార్పొరేటర్లు సంతోష్ రావు, గట్ల రమేష్, ఏడీఈ గుండు శ్రీనివాస్, ఏసీపీ నవీన్, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, కృపాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)