Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Gold theft: బంధువుల ఇంట్లో బంగారం కొట్టేసి... వారినే పూజకు పిలిచి..
By Eenadu||1 min read at Eenadu
In brief
In Kolhapur, Maharashtra, a 19-year-old man named Samar Popat Chavan allegedly stole gold from his uncle Umesh Maruti Chavan's house.
After selling the ornaments, he purchased a car and allegedly invited his uncle to the vehicle's puja, which led to the uncle filing a police complaint.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొల్హాపూర్: బంధువుల ఇంట్లో బంగారం (Gold) కొట్టేశాడు. ఎవరి ఇంట్లో బంగారం దొంగిలించాడో.. ఎలాంటి బెరుకూ లేకుండా వారినే వాహన పూజకు ఆహ్వానించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra) కొల్హాపూర్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల నిందితుడు సమర్ పోపట్ చవాన్... తన అంకుల్ ఉమేశ్ మారుతి చవాన్ ఇంట్లో నెల రోజుల క్రితం బంగారు ఆభరణాలను తస్కరించాడు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. కొంత జల్సాలు చేశాడు. తాజాగా ఓ కారు కొనుగోలు చేశాడు. వాహన పూజకు ఉమేశ్‌ను కూడా ఆహ్వానించాడు.
బంగారు ఆభరణాలు పోయిన సంగతి రెండు రోజుల క్రితమే ఉమేశ్‌కు తెలియడంతో.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈలోగా సమర్.. ఖరీదైన వాహనం కొనుగోలు చేయడం అనుమానాలకు తావిచ్చింది. పూర్వీకుల బంగారం గురించి.. బంధువులకు తప్ప మిగతావాళ్లకు తెలియదని ఉమేశ్ పోలీసులకు చెప్పగా.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమర్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. సమర్‌తోపాటు.. బంగారం కొనుగోలు చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)