Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గ్రామాభివృద్దే నా లక్ష్యం: ఎమ్మెల్యే విజయ్చంద్ర
By Eenadu1 min read at Eenadu
In brief
MLA Bonela Vijaychandra stated that village development is his goal and urged voters in the Parvathipuram constituency to elect TDP and Jana Sena candidates with a large majority.
He held a massive rally in several villages alongside coalition candidates and asked voters not to believe leaders of the 'Axe Party'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బలిజిపేట: గ్రామాభివృద్ధే తన లక్ష్యం అని ఎమ్మెల్యే విజయ్చంద్ర అన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తెదేపా, జనసేన పార్టీ జెండాలు ఎగరవేసేందుకు ప్రజలందరూ.. తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి బంకపల్లి సింహాచలం, జడ్పీటీసీ జనసేన అభ్యర్థిని పాలూరు చాందినికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మండలంలోని అన్ని గ్రామాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. మండలంలోని బడేవలస, సుభద్ర, చిలకలపల్లి, గలావల్లి, బలిజిపేట, నారాయణపురం గ్రామాల్లో ఆయన కూటమి అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో సాగు, తాగునీరు, రహదారుల నిర్మాణానికి తన వంతు నిధులు మంజూరు చేసామన్నారు. గ్రామానికి వస్తున్న నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దని, అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్న కూటమి నేతలకు అండగా నిలవాలని ఆయన ఓటర్లను కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బి.రామ్మోహన్ రావు, తెదేపా నాయకులు రాంబాబు, సింహాచలం నాయుడు, కర్రి శ్రీరామ్, గౌరునాయుడు, తెదేపా అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)