Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In the Greater Hyderabad area, domestic cooking gas cylinders are being illegally diverted to the black market, where they are sold at more than double the official government price of Rs.
990.
According to the report, gas agencies are openly supplying these cylinders to traders, and civil supplies officials are allegedly turning a blind eye due to monthly bribes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) :గ్రేటర్ పరిధిలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. వంట గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు అందించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నాయి. 14కేజీల డొమెస్టిక్ వంట గ్యాస్ ప్రభుత్వ ధర రూ.990గా ఉంది. దీన్ని వ్యాపారులు బ్లాక్లో రూ.2,500పైగా అమ్ముతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు బహిరంగంగానే సరఫరా చేస్తున్నట్లు వ్యాపారులే స్వయంగా చెప్తున్నారు. ఈ దందా బహిరంగంగా కొనసాగుతున్నా పౌర సరఫరాల అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
నిత్యం వేలాది సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు చేరుతున్నా ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఏజెన్సీలో గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న అసలైన వినియోగదారులకు అందాల్సిన సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. ఈ వ్యవహారంలో పౌర సరఫరాల అధికారుల హస్తం ఉన్నందు వల్లనే తనిఖీలు చేపట్టకుండా మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఏజెన్సీ నుంచి పౌరసరఫరాల అధికారులకు ప్రతినెలా రూ.లక్షల్లో వెళ్తున్నాయనే చర్చ జరుగుతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)