Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Hair Thinning | జుట్టు రాలకపోయినా పలుచబడుతోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
This article discusses the symptoms and causes of hair thinning, noting that while some genetic hair loss is unavoidable, identifying hormonal imbalances early can help in managing the condition.
It advises readers not to neglect the early signs of thinning hair.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Hair Thinning | నెత్తిమీద చేయిపెడితే జుట్టు తగ్గినట్టుగా అనుమానించడం, అద్దంలో చూసుకోవడం, అంతా బాగానే ఉందనుకోవడం చాలామందికి అనుభవమే. ఇలాంటి సందేహం వచ్చినప్పుడు దానిని నివృత్తి చేసుకుంటే మంచిది. నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకుంటే జుట్టు తగ్గడాన్ని చాలా ముందుగా గుర్తించవచ్చు. ఆ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు. చాలామందికి జుట్టు రాలడమే తెలుసు. కొందరిలో జుట్టు సన్నబడిపోయే సమస్యా ఉంటుంది. వెంటుకలు తయారయ్యే కుదుళ్లలో జరిగే జీవ రసాయన మార్పుల వల్ల వెంట్రుకల మందం తగ్గిపోతుంది. మందం తగ్గడం వల్ల జుట్టు ఒత్తుగా కనిపించినా, నెత్తిమీద చేయి ఆన్చితే జుట్టు తగ్గిందనిపిస్తుంది.
ఇలా వెంట్రుకలు సన్నబడటాన్ని ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా’ అంటారు. ఈ సమస్యకు రెండు రకాల కారణాలుంటాయి. జన్యు సంబంధమైన కారణాల వల్ల కొందరిలో ఇలా జరుగుతుంది. దీనిని నివారించడం సాధ్యం కాదు. మరికొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే మార్పులతో వెంట్రుకలు పలుచబడతాయి. వెంట్రుకలు పలుచబడటం మొదలైతే దీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ మార్పువల్ల మొదట తలకట్టు తగ్గిపోతుంది. కొన్నాళ్లకు కొంత జుట్టు రాలిపోతుంది. కాబట్టి హార్మోన్ల అసమతుల్యతకు కారణాలు తెలుసుకుని సరిచేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)