Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Hanmanth Shinde | డోంగ్లీలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు.. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former MLA Hanmanth Shinde attended a BRS party workers' meeting in Dongli, Kamareddy district, where several Congress and BJP leaders and workers joined the BRS.
Shinde welcomed the new members and urged them to work collectively to strengthen the party.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Hanmanth Shinde | నిజాంసాగర్/డోంగ్లీ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్-డోంగ్లీ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండల పరిధిలోని మొగ, సోనాల, వాడి, లింబర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం హన్మంత్ షిండే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికీ స్వాగతం పలుకుతూ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)