Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
హెరిటేజ్ ఫుడ్స్‌లో డ్రమ్ పేలి మహిళ మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
రామంతాపూర్‌లోని ఐడీఏ ఉప్పల్‌లోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో డ్రమ్ పేలడంతో కార్మికురాలు పింకీదేవి అక్కడికక్కడే మరణించింది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కంపెనీ ఎదుట ఆందోళన చేసి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రామంతాపూర్, నవంబర్ 21: ఐడీఏ ఉప్పల్‌లోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ఫ్యాక్టరీలోని డ్రమ్ ఒకసారిగా పేలడంతో కార్మికురాలు పింకీదేవి(35) అకడికకడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన దంపతులు హరేంద్రషా, పింకీదేవి రామంతాపూర్‌లోని గాంధీనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి రీసు, ప్రిన్స్, క్రియాంశ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పింకీదేవి హెరిటేజ్ ఫుడ్స్‌లో పనిచేస్తున్నది. క్రేట్ వాషర్ వద్ద వ్యర్థాలు పారబోసేందుకు మొదటి అంతస్తులోని డ్రమ్ వద్దకు వెళ్లింది.
ఆ సమయంలో ఒకసారిగా డ్రమ్ పేలడంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)