Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Himanta Biswa Sarma: భాజపా ఓట్లు చోరీ చేయదు.. మనసుల్ని దోచుకుంటుంది: సీఎం హిమంత
By Eenadu1 min read at Eenadu
In brief
Assam Chief Minister Himanta Biswa Sarma participated in a protest march in Shimla, Himachal Pradesh, criticizing the Congress party's handling of the state government and its stance on EVMs.
He accused Congress of hypocrisy regarding EVMs, claimed they misuse regional political developments in Bangladesh and Nepal, and alleged they failed to deliver on job promises in Himachal Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శిమ్లా: భాజపా ఓట్లు చోరీ చేయదు.. ప్రజల మనుసుల్ని దోచుకుంటుందని అస్సాం సీఎం, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) అన్నారు. హిమాచల్‌ప్రదేశ్ శిమ్లాలో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి- పారద్రోలండి’ పేరిట నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఈవీఎంలతోనే కాదు.. ఇటీవల పలు రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమిపాలైందన్నారు. ఈవీఎంలతోనే హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తోందని…
కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలను కాంగ్రెస్ నేతలు అంగీకరించారనీ.. కానీ, భాజపా గెలిచినప్పుడల్లా ఈసీని, ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తున్నారని హిమంత మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడేందుకు కచ్చితమైన ఓటరు జాబితాలు అవసరమన్నారు. దేశంలో అస్థిర వాతావరణాన్ని సృష్టించేందుకే బంగ్లాదేశ్, నేపాల్‌లోని రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ వాడుకుంటోందని ఆరోపిస్తూ ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు.. ఒక ప్రజాస్వామ్యదేశం. ఇక్కడి ప్రభుత్వాలు రాజకీయ బెదిరింపులకో, వీధిస్థాయి అరాచకాలతో మారవు.. ప్రజల ఓట్లతోనే మారతాయి’’ అని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)