Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Home decoration: కాస్త శ్రద్ధ పెడితే ‘చూడ ముచ్చటే’
By Eenadu2 min read at Eenadu
In brief
The article provides general advice on home organization, suggesting that decluttering and using organizers can create a more peaceful and beautiful living environment.
It recommends sorting items by frequency of use, utilizing vertical space, and reviewing unused items before purchasing new storage solutions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఉదయం నిద్రలేవగానే ఇల్లు ప్రశాంతంగా, అందంగా ఉంటే మనసు హాయిగా ఉంటుంది. అదే వస్తువులు చిందరవందరగా... గందరగోళంగా ఉంటే చిరాకు వస్తుంది. ఎంత సర్దినా ఇంకా ఏదోమూల అపరిశుభ్రంగానే ఉంటుందా? కొత్త అల్మారాలు, ఆర్గనైజర్లు (నిల్వ సాధనాలు) కొనుగోలు చేసినా ఈ సమస్య పరిష్కారం కావడం లేదా? ఇలాంటి సందర్భాల్లోనే ఇల్లు సర్దుకోవడం ఒక కళ.. ఏ వస్తువును ఎక్కడ సర్దాలి.. ఉన్న స్థలాన్నే అవసరానికి తగిన విధంగా ఎలా వినియోగించుకోవాలనేది నేర్పరితనం. వస్తువుల్ని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా.. ప్రతి వస్తువుకూ ఒక స్థానం కేటాయించి సర్దుబాటు చేసుకుంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఇంటిని సర్దడం ప్రారంభించే ముందు ప్రతి గదిలో ఉన్న వస్తువులను, వాటిని పెట్టుకోవడానికి అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలించాలి. ఒకేరకమైన వస్తువులన్నింటినీ ఒకచోటకి చేర్చాలి. రోజూ వాడేవి చేతికందేలా ఉంచి, అప్పుడప్పుడు అవసరమయ్యే వాటిని పెట్టెల్లో భద్రపర్చుకోవాలి. సీజన్ దుస్తులు, దుప్పట్లు, పండగలప్పుడు వాడే వస్తువులను మంచం కింద లేదా అటక మీద పెట్టుకోవచ్చు. తేమ, దుమ్ము చేరకుండా... అవసరమైనప్పుడు వాటిలో ఏముందో తెలిసేలా పెట్టెలపై రాసుకోవాలి. ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉంటే అవసరమైనవి ఉంచుకోవాలి. బాగున్నా అవసరం లేనివాటిని ఇతరులకు ఇవ్వాలి. పాడైనవి, పనికిరానివి ఉంటే వాటిని తొలగించాలి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)