Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
HYD News: పండగ వేళ దాడులు.. 4 పాలపిట్టలను కాపాడిన పోలీసులు
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
Hyderabad Police rescued four Indian rollers (palapitta) from cages in various temples across the city during the Dussehra festival.
Police Commissioner Sajjanar condemned the act and urged citizens to report any wildlife cruelty to the forest department or emergency numbers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు కోసం ఇనుప బోనుల్లో బంధించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ (VC Sajjanar) తెలిపారు. పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడినట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
‘‘లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను పోలీసులు విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించారు. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు వేలాడదీసిన బోనులో నిర్బంధించిన ఒక పాలపిట్టను, మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)