Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇదేనా క్రీడలకు ప్రోత్సాహం?
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- RS Praveen Kumar, a BRS leader and former IPS officer, expressed outrage on X over the removal of kayaking and canoeing from the Khelo India sports events list in Telangana. He accused the state government of hypocrisy and social discrimination against tribal students.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వేదికగా జరుగనున్న ఖేలో ఇండియా క్రీడాపోటీల జాబితా నుంచి కయాకింగ్, కెనోయింగ్ వాటర్ స్పోర్ట్స్ను తొలగించాలనుకోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ భవిష్యత్తు అంధకారమవుతున్నదని గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారని ఆయన పేరొన్నారు.
సొంత రాష్ట్రంలో జరుగుతున్న పోటీల్లో భాగస్వామ్యం లేకుండా చేయడం ప్రతిభను ఉద్దేశపూర్వకంగా తొకిపెట్టడమేనని మండిపడ్డారు. ఒకవైపు సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని భారీ ప్రకటనలు చేస్తూ, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్న క్రీడాకారుల అవకాశాలను కాలరాయడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని దుయ్యబట్టారు.