Namasthe Telangana
ఇది మా నాన్నకు నచ్చిన సినిమా
Entertainment — not analysed for political framing
‘దుల్కర్ ఫ్యాన్స్‌కీ, నా ఫ్యాన్స్‌కీ హాయ్ హాయ్.. నటుడిగా దుల్కర్ది వైవిద్యమైన ప్రయాణం. భాషలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారాయన. మెగాస్టార్ మమ్ముట్టి తనయుడైనా డౌన్టు ఎర్త్గానే ఉంటారు దుల్కర్. ప్యాషన్‌తో కథలను ఎంచుకుంటారు. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. కచ్చితంగా ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర గొప్పగానే ఉంటుందని నా నమ్మకం. సాత్వికకు ఈ సినిమా అద్భుతమైన లాంచింగ్. పవన్ సాధినేని వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. అద్భుతంగా తీసుంటాడు. మా నాన్న అరవింద్‌గారికి ఈ సినిమా బాగా నచ్చింది. గీతాఆర్ట్స్, వైజయంతీ మూవీస్ కలిసి తీసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని అతిథిగా విచ్చేసిన అగ్ర హీరో…
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి కథానాయిక. పవన్ సాధినేని దర్శకుడు. అల్లు అరవింద్, స్వప్నదత్, సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు. ఈనెల 20న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడారు. చిత్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “సీతారామం’ తర్వాత విన్న కథ ఇది. ఈ కథ విన్నప్పుడు నా కెరీర్లోనే స్పెషల్ మూవీ అనిపించింది. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)