Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇన్‌స్టాలోకి సోనియా.. తొలి పోస్టుగా ఆత్మకథ..
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Congress party leader Sonia Gandhi joined Instagram and shared the first look of her autobiography 'Belonging: A Journey of Love'.
She stated that the book, which will be released globally on November 10, covers themes of love, duty, tragedy, and social-political changes she witnessed over six decades.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తన జీవిత విశేషాలతో రూపొందించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఫస్ట్‌లుక్‌ను తొలి పోస్టుగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 10న ఈ పుస్తకం విడుదల కానుంది. తన జీవితంలో జరిగిన అనేక అంశాలతోపాటు ప్రేమ, కర్తవ్యం, విషాదాలు, మలుపులను ఈ పుస్తకంలో వివరించినట్లు సోనియా వెల్లడించారు. తన ఆత్మకథను పాఠకులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆమెకు పుస్తకాన్ని అందించిన ప్రచురణకర్తలను ఉద్దేశించి.. ‘‘మీరు చాలా బరువైన బాధ్యతను మోసుకొచ్చారు’’ అని నవ్వుతూ చమత్కరించారు. అనంతరం 544 పేజీల పుస్తకాన్ని పట్టుకొని ఫొటోలు దిగారు. పేజీలను ఆసక్తిగా తిరగేస్తూ అందులోని అరుదైన ఫొటోలను కుమార్తె ప్రియాంక గాంధీకి చూపించారు. ఈ సందర్భంగా సోనియాకు ప్రియాంక స్వీట్లు తినిపించి ఆలింగనం చేసుకున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)