Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
INDIA Alliance: డీలిమిటేషన్ బిల్లు వేళ.. స్టాలిన్, పవార్‌లతో చర్చించనున్న ‘ఇండియా’ కూటమి
By Eenadu1 min read at Eenadu
In brief
దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి అని ఇంటర్నెట్ డెస్క్ పేర్కొంది, ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సీనియర్ నేతలు డీఎంకేను మళ్లీ తమదారిలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ తదితరులతో కూడిన బృందం ఆదివారం చెన్నైలో డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్‌తో చర్చలు జరపనుంది.
ముంబయిలో ఎన్సీపీ ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్తోనూ వారు భేటీ కానున్నట్లు సమాచారం అని కూడా ఆ వార్త తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వేళ.. దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ బిల్లుకు ఇప్పటికే మద్దతు పలికిన డీఎంకేను మళ్లీ తమదారిలోకి తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA Alliance) సీనియర్ నేతలు సన్నాహాలు ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితరులతో కూడిన బృందం ఆదివారం చెన్నైలో డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ (MK Stalin)తో చర్చలు జరపనుంది. ముంబయిలో ఎన్సీపీ ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్తోనూ వారు భేటీ కానున్నట్లు సమాచారం.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘విపక్ష కూటమి నేతలతో నేను డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించాలని అభ్యర్థించనున్నాం. లోక్‌సభ సీట్లను 850కి పెంచడమనేది దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుంది. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా- ఆర్ఎస్ఎస్లకు ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. సోదరుడు స్టాలిన్ ఎల్లప్పుడూ ఎదురొడ్డి నిలబడ్డారు. దేశ, తమిళనాడు ప్రయోజనాల కోసం, రాజ్యాంగ పరిరక్షణకు మనమంతా కలిసి ఈ బిల్లును ఓడించాలి’’ అని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)