Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
An IndiGo flight (6E 6091) from Delhi to Chennai was stopped before takeoff after crew found a fake bomb threat note in the aircraft's toilet at the Indira Gandhi International Airport on Friday afternoon.
The flight was grounded, inspected, and eventually departed at 5:00 PM, landing safely in Chennai at 7:40 PM, according to an IndiGo official.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. టేకాఫ్‌కు ముందు ఫైట్ టాయిలెట్లో ఈ బెదరింపు సందేశాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ విమానం పార్కింగ్ బే వద్దకు తిరిగి చేరుకున్నది. (IndiGo flight) ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఇండిగో విమానం 6ఈ 6091, ఢిల్లీ నుంచి చెన్నైకు బయలుదేరాల్సి ఉన్నది. అయితే టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆ విమానం వెనుక భాగంలోని టాయిలెట్లో ఒక ‘హెచ్చరిక’ నోట్ లభించింది. ఆ విమానాన్ని చెన్నైకి ప్రయాణం కొనసాగించవద్దని హెచ్చరించినట్లుగా అందులో ఉన్నది.
కాగా, ఈ బెదిరింపు సందేశాన్ని విమాన సిబ్బంది గుర్తించారు. దీంతో సంబంధిత నిబంధనల ప్రకారం విమానం టేకాఫ్‌ను రద్దు చేశారు. దానిని తిరిగి బేకి తీసుకువచ్చారు. అవసరమైన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్వోపీ) పూర్తి చేశారు. ఆ బెదిరింపు నోట్ బూటకమని తేలింది. ఈ నేపథ్యంలో సుమారు రెండు గంటలు ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆ విమానం టేకాఫ్ అయ్యింది. రాత్రి 7.40 గంటలకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అది సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ఇండిగో అధికారి తెలిపారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)