Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఇన్సూరెన్స్ ఉంటేనే.. ఆర్టీఏలోకి!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the Telangana RTA will no longer accept one-month vehicle insurance policies starting October 21, making annual insurance mandatory for all RTA services.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వాహనదారులు ఇన్సూరెన్స్‌ల రెన్యువల్లో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇకపై అలా కుదరదు. ఆర్టీఏలో ఎటువంటి సేవలు పొందాలన్నా ఇకపై ఇన్సూరెన్స్ గడువు తప్పనిసరి. అందుకోసం ఎంవీఐ, ఆర్టీఓలే స్వయంగా పరిశీలించనున్నారు. ఐఐబీ పోర్టల్‌లో పాలసీ నెంబర్, బండి నంబర్, ఇంజిన్, చాసిస్ నంబర్ కరెక్టేనా? కాదా? అని వెరిఫై చేసి ఆరా తీస్తున్నారు. ఏదైనా గడువు లేకుండా ఉంటే వెంటనే రిజక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఆటోలు, క్యాబ్‌లు వన్ మంత్ ఇన్సూరెన్స్‌తో కాలం వెల్లదీశాయి. కానీ ఆర్టీఏలో అక్టోబర్ 21 నుంచి వన్‌మంత్ ఇన్సూరెన్స్‌ను అధికారులు యాక్సెప్ట్ చేయడం లేదు. ఒకనెలకు రూ.1500 లోపు ఖర్చు అయ్యేది.
సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): చాలా మంది ఆటో, క్యాబ్ దారులు వన్‌మంత్ ఇన్సూరెన్స్ తీసుకొని తమ వాహనాల ఫిట్నెస్ పొందేవారు. ఇక ఫిట్నెస్ గడువు ఏడాది ఉండటంతో అప్పటి వరకు కేవలం వన్ మంత్ మీదనే రాకపోకలు సాగించే వారు. అధికారులు కూడా తాము ఫిట్నెస్ చేస్తున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ గడువు ఉందా? లేదా? అని చూసి ఫిట్నెస్ ఇచ్చేవారు. అయితే ఈ ప్రక్రియపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇకపై వన్‌మంత్ ఇన్సూరెన్స్ చెల్లదని తేల్చేశారు. కచ్చితంగా వాహన ఇన్సూరెన్స్ ఏడాది ఉండాల్సిందేనని షరతులు విధించారు. వాలిడ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎటువంటి ఆర్టీఏ సేవలు అందవని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)