Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇప్పటికైనా కులగణనలో నమోదు చేసుకోండి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
By V6 Velugu||4 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy urged people to register for the caste census and stated that his government completed it between February 2024 and February 2025.
He promised to include the Mudiraj community in the BC-A category based on the new census data, while also assuring the Gangaputras that their interests would be protected.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: కులగణనలో నమోదు చేసుకోనివారు ఇప్పటికైనా అధికారులకు వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన ముదిరాజ్ వీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘కులగణన లెక్కల్లో లోపాలున్నాయని కొందరు అంటున్నారు. సహకరించకుండా విమర్శలు చేయడం సరికాదు. ఇంకా నమోదు చేసుకోనివారు ఎవరైనా ఉంటే అధికారుల వద్ద నమోదు చేసుకోండి. హడావుడిగా కులగణన చేయొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాను’’ అని చెప్పారు.
జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రకటించారని సీఎం గుర్తుచేశారు. అందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి మధ్య ఏడాది వ్యవధిలో కులగణన పూర్తి చేసిందని, అయితే కొందరు అందులో పాల్గొనలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని, 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను తమ ప్రజాప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ సందర్భంగా పండుగ సాయన్నపై రూపొందించిన పాటను సీఎం విడుదల చేశారు. ఆ పాటను…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)