Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jagityal | 27న జగిత్యాల జిల్లాలో జాబ్ మేళా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to District Employment Officer Satyamma, a job fair will be held on the 27th at the District Employment Office in Jagtial district to recruit candidates for private sector jobs at Lulu International Shopping Mall in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Jagityal | జగిత్యాల, అక్టోబర్ 26 : జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగులకు యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని ఖాళీలు కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ ఆ పైన విద్య అర్హతలు కలిగి ఉన్న విద్యార్థులు అర్హులని తెలిపారు.
ఎంపిక కాపాడిన అభ్యర్థులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుందని, వేతనం నెలకు రూ.18వేల నుండి రూ.25 వేల వరకు, ఫ్రీ ఫుడ్ , హాస్టల్ వసతి కల్పించనున్నారని, అర్హత ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు 27న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే జాబ్ మేళాకు రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూలు జగిత్యాల కలెక్టరేట్ భవనంలోని రెండో అంతస్తులోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం గల రూమ్ నంబర్ 217 జరుగుతాయని, కావున ఉద్యోగార్థులు హాజరు కావాలని సూచించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)
