Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘జీరో ఆల్కహాల్’ నిబంధనతో.. లోకోపైలట్లపై నీలాపనిందలు
By Eenadu||2 min read at Eenadu
In brief
Railway pilots with no history of alcohol consumption are facing disciplinary action under the 'zero alcohol' rule due to blood alcohol levels of 10 mg/dL or more.
The Railway Safety Commissioner's inquiry into a 2025 train collision in Bilaspur, Chhattisgarh, revealed that running staff had alcohol in their blood samples but not in breathalyzer tests.
A railway union is urging the Railway Board to urgently make a decision on the matter, citing scientific studies that explain how alcohol can appear in the blood without consumption.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: జీవితంలో ఎప్పుడూ మద్యం తీసుకోని లోకోపైలట్లు కూడా ‘జీరో ఆల్కహాల్’ నిబంధన కింద రైల్వేశాఖలో క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటున్నారు. వారి రక్త నమూనాలు 10 ఎంజీ/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ ఫలితాలను చూపించడమే కారణం. ప్రస్తుత నిబంధనల ప్రకారం రైళ్లు నడిపే లోకోపైలట్ల రక్తంలో మద్యం శాతం సున్నా మాత్రమే ఉండాలి. సున్నా కన్నా కాస్త ఎక్కువ ఆల్కహాల్‌ను గుర్తించినట్లయితే ఆ లోకోపైలట్లు రైలు నడపడానికి అర్హులా.. కాదా అనే విషయంపై రైల్వేబోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒక సీనియర్ అధికారి పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ వద్ద 2025లో రెండు రైళ్లు ఢీకొన్నప్పుడు ఆ రైళ్లను నడిపిన సిబ్బందిలో ప్రతి 100 మి.లీ. రక్తానికి 3 నుంచి 10 మిల్లీగ్రాముల వరకు ఆల్కహాల్ పరిమాణం ఉన్నట్లు రైల్వే భద్రతా కమిషనర్ (సీఆర్ఎస్) విచారణలో తేలింది. దీంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఆర్ఎస్ విచారణలో వెల్లడైన కీలక అంశాల్లో ఒకటి ఏమిటంటే.. రన్నింగ్ సిబ్బంది శ్వాసకు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని వచ్చినప్పటికీ, వారి రక్త నమూనాల్లో 10 ఎంజి/డీఎల్ వరకు ఇథనాల్ శాతం కనిపించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)