Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jensen Huang | జెన్సన్ రిటర్న్స్.. ఎన్విడియా సీఈవోగా మళ్లీ పగ్గాలు!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
ఎన్విడియా ప్రెసిడెంట్ మరియు సీఈవోగా జెన్సన్ హువాంగ్ తిరిగి నియమితులయ్యారని బోర్డు సోమవారం ఆమోదించింది. చైనా గూఢచారి అయి ఉండవచ్చన్న అనుమానాలున్న మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆయన గతంలో రాజీనామా చేశారు.
జాతీయ భద్రతపై ఆందోళనలను తొలగిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పునర్నియామకాన్ని సమర్థించారని, మార్కెట్ ప్రారంభంలోనే ఎన్విడియా షేర్లు 33 శాతం పెరిగాయని బోర్డు చైర్మన్ హార్వే సి.
జోన్స్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage → · Followed over 11 days across 2 events →
Jensen Huang | వాషింగ్టన్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈవోగా జెన్సన్ హువాంగ్ తిరిగి నియమితులయ్యారు. ఆయన పునర్నియామకానికి బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. చైనా అయి ఉండవచ్చన్న అనుమానాలున్న మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో జెన్సన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ‘ఎన్విడియాకు నాయకత్వం వహించడానికి జెన్సెనే సరైన వ్యక్తి అని, ఆయనను తిరిగి నియమించడం మా వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారుల ప్రయోజనాలకు అనుకూలమని బోర్డు భావిస్తున్నది’ అని బోర్డు చైర్మన్ హార్వే సి.
జోన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. జెన్సన్ పునర్నియామకం గురించి ఆదివారం ఆయనతో మాట్లాడానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సీఎన్బీసీతో మాట్లాడుతూ జెన్సన్ పునర్నియామకానికి తానే కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ‘నా జోక్యం చాలా ముఖ్యమైందని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. జెన్సన్ తిరిగి రావడంపై జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలు లేవని తన ప్రభుత్వం ఎన్విడియాకు హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్పారు. బోర్డు సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడారా అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పలేదు. అయితే, ‘సాధారణంగా చెప్పాలంటే బోర్డులో నాకు ప్రాతినిధ్యం ఉన్నది’ అని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)