Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జిల్లాల్లోనే 90 శాతం మందికి వైద్య సేవలు: మంత్రి దామోదర
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Minister Damodar Rajanarsimha stated that the government's goal is to provide better medical services to at least 90 percent of patients within their own districts.
He reviewed the progress of hospital construction and instructed officials to ensure uninterrupted water and power supply, particularly considering the El Nino impact.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
తెలంగాణలోని కనీసం 90 శాతం మంది రోగులకు వారి జిల్లాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందుకోసం గత మూడేళ్లలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు సహా ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. డీఎస్‌హెచ్ పరిధిలోని ఆస్పత్రుల్లో ఇటీవల 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు వివరించారు.కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాలు, సమకూర్చనున్న వైద్య పరికరాలను సమర్థంగా వినియోగించుకుంటూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారులు (డీసీహెచ్ఎస్), ఆస్పత్రి సూపరింటెండెంట్లకు సూచించారు.
సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ (డీఎస్‌హెచ్) పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల భవన నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. డిసెంబర్ 2026 నాటికి మరో 14 భవనాలు, 2027 మార్చి నాటికి మరో 11 భవనాల నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలిపారు. మరో 45 భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)