Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jio plotforms IPO: ముగిసిన జియో ఐపీఓ.. 22 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్
By Eenadu||1 min read at Eenadu
In brief
Reliance Jio Platforms' IPO subscription closed with a total response of 22.19 times, according to the report.
The QIB quota was the most oversubscribed at 70 times, while the retail category received a 2.72 times subscription.
The shares are expected to list on the stock exchanges on the 28th of this month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Jio plotforms IPO | ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ జియోకు చెందిన జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ (Jio plotforms IPO) సబ్స్క్రిప్షన్ ముగిసింది. మూడో రోజు చివరికి నాటికి మొత్తం 22.19 రెట్ల స్పందన అందుకుంది. మొత్తం 19.75 కోట్ల షేర్లకు గానూ 438 కోట్ల బిడ్లు వచ్చాయి. క్యూఐబీ కోటా అత్యధికంగా 70 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. రిటెయిల్ ఇన్వెస్టర్ల కోట 2.72 రెట్లు సబ్స్క్రిప్షన్ అందుకుంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ కోటా 14 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఉద్యోగుల కోటాకు 2.93 రెట్లు స్పందన రాగా.. రిలయన్స్ షేర్హోల్డర్ల కేటగిరీ 7.6 రెట్లు స్పందన పొందింది.
జియో ప్లాట్ఫామ్స్ షేర్లు గ్రే మార్కెట్ ప్రీమియం రూ.238గా ఉంది. అంటే సుమారు 21 శాతం లాభాన్ని సూచిస్తోంది. అప్పర్ ప్రైస్బ్యాండ్ రూ.1,119 కాగా.. లిస్టింగ్ రోజు రూ.1,357 వద్ద షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉందని గ్రేమార్కెట్ అంచనా వేస్తోంది. అయితే, గ్రే మార్కెట్ ప్రీమియం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. లిస్టింగ్ రోజు వరకు ఇదే సెంటిమెంట్ కొనసాగుతుందని చెప్పలేం. కాబట్టి లిస్టింగ్ రోజు వరకు వేచి చూడాల్సిందే. షేర్ల కేటాయింపు ఈనెల 26న జరగనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 28న జియో ప్లాట్ఫామ్స్ షేర్లు నమోదు కానున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)