Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్కు ‘పట్టభద్రుల’ భయం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో భారీగా ఓటరు నమోదు పెరగడం అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.
పట్టభద్రులు, ఉద్యోగులు ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కర్ణాటక ఫలితాల ప్రతికూల ప్రభావం తెలంగాణలోనూ పడుతుందనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో భారీగా ఓటరు నమోదు పెరుగడం కాంగ్రెస్లో గుబులు రేపుతున్నది. పట్టభద్రులు పెద్దసంఖ్యలో ఓటు నమోదుకు ముందుకు రావడంతో అధికార పార్టీని తీవ్రంగా కలవరపెడుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో ఓటు నమోదు కార్యక్రమానికి వీలైనంత దూరంగా ఉన్నది. ఓటర్ల సంఖ్య పెరిగే కొద్దీ అది ముమ్మాటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారి ఫలితాన్ని తారుమారు చేస్తుందని భయపడుతూ వచ్చింది.
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా అధికారంలో ఉన్న పార్టీ తమ అనుకూల ఓటర్లను పెద్ద సంఖ్యలో నమోదు చేయించేందుకు ప్రత్యేక శిబిరాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అధికార పార్టీ శ్రేణులు పూర్తిగా నిరాసక్తత కనబరిచాయి. క్షేత్రస్థాయిలో ఓటు నమోదును ఉద్దేశపూర్వకంగానే తగ్గించాలని చూసినట్టు ప్రచారం జరిగింది. పట్టభద్రులు, యువత పెద్దసంఖ్యలో జాబితాలోకి ఎకితే ఆ ఓట్లన్నీ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా తమకే వ్యతిరేకంగా పోలవుతాయని పార్టీ పెద్దలు భావించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)