Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడాకు ప్రధాని సర్ ప్రైజ్ విషెస్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Prime Minister Modi and Congress leader Sam Pitroda shared a friendly Diwali greeting on X, with Modi calling him 'Sam Bhai' and Pitroda referring to the PM as his 'Gujarati friend'.
Pitroda clarified in an interview that while they have political differences, they have no personal animosity, and he also denied the BJP's allegations of Congress colluding with foreign powers like George Soros.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: రాజకీయంగా నిత్యం విమర్శలు గుప్పించుకునే ప్రధాని మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మధ్య దీపావళి వేళ రీతిలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. పిట్రోడా తనను 'గుజరాతీ స్నేహితుడు' అని అభివర్ణించడంతోపాటు వ్యక్తిగతంగా ఎలాంటి విద్వేషాలు లేవని పేర్కొనగా.. ప్రధాని మోదీ ఆయనకు దీపావళి, గుజరాతీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 'సామ్ భాయ్' అని సంబోధించారు. "శామ్ భాయ్, అంజనా బెన్లకు దీపావళి, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రాబోయే కాలం మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి" అని ప్రధాని 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. అంతకుముందు పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోదీ తన గుజరాతీ స్నేహితుడని, ఆయనొక మంచి వక్త, కష్టపడి పనిచేసే వ్యక్తిని కొనియాడారు. తమ మధ్య రాజకీయ, సైద్ధాంతిక విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి కక్షల్లేవని స్పష్టం చేశారు. మోదీని రాజకీయంగా విభేదిస్తూనే, ఆయనతో కలిసి భోజనం చేసి నవ్వుతూ గడపగలనని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)