Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కదలని రెవెన్యూ ఫైళ్లు!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that revenue file processing is severely delayed across Telangana, leaving thousands of land mutation and refund applications pending.
Victims and officials attribute the delays to bureaucratic apathy and a lack of coordination between departments, with some cases reaching the High Court.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్21 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ కార్యాలయంలో ఒక ఫైలు కదలటానికి ఎన్ని రోజులు పడుతుంది? క్షేత్రస్థాయి విచారణ పూర్తయి, అధికారులు నివేదిక సమర్పించిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోకపోతే, భూమి తనదేనని నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా, రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తే బాధితుడు ఇంకెవరిని ఆశ్రయించాలి? ప్రస్తుతం రాష్ట్రంలోని రెవెన్యూ ఫైళ్ల పరిస్థితి ఇదే. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లలో నిర్ణయాలు జాప్యం చేస్తున్నారని, భూ సంబంధిత దరఖాస్తులు వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పని పూర్తయినా…
నివేదిక పూర్తయినా ముందుకు కదలదా? సంగారెడ్డి జిల్లాలో 1,100 ఎకరాల దళిత, బహుజన అసైన్డ్ భూములను పెద్దలకు కట్టబెట్టేందుకు కలెక్టర్ చకచకా సంతకాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒక మహిళకు వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం పట్టాభూమిని మ్యుటేషన్ చేయడానికి మాత్రం నెలలు గడుస్తున్నా, సమయం దొరకడం లేదట. కంది మండలంలో ఉన్న భూమికి క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ పూర్తయి సంబంధిత అధికారులు స్పష్టమైన నివేదిక సమర్పించినా, ఆ ఫైలు గత నెల రోజులుగా కలెక్టర్ టేబుల్‌పైనే మూలుగుతున్నదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోవడంలో ఇంతటి తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతున్నదో అధికారులు చెప్పడం లేదని ఆమె…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)