Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కడెం నీటికోసం రైతుల ఆందోళన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Farmers in Janaram mandal, Mancherial district, demanded water for crops from the Kadem project's left canal, staging a protest at a forest checkpost on Monday.
They claimed water was deliberately withheld while being diverted to factories in Hyderabad, causing traffic jams.
The protest ended after irrigation officials agreed to release water into the canal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జన్నారం, నవంబర్ 9 : కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా పంటలకు సాగు నీరివ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్లోని అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద ప్రధాన రోడ్డుపై చింతగూడ సింగిల్ విడో వైస్ చైర్మన్ కమ్మల విజయధర్మ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు బైఠాయించడంతో ఇరువైపులా మూడు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై ఉదయ్‌కిరణ్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడినప్పటికీ వారు శాంతించలేదు. సాగునీరు విడుదల చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు వ్యతిరేకంగా నినాదాలు…
కడెం ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా కావాలనే సరఫరా నిలిపివేశారని, రాత్రివేళల్లో గోదావరి నీటిని వదలి హైదరాబాద్‌లోని ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ పంటలు ఎండిపోతుంటే ఎవరి మెప్పుకోసం ఇక్కడి నీటిని తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. ‘మా నీరు మాకు ఇవ్వాలి.. పంటలు చేతికి వచ్చే వరకు సాగు నీరిచ్చి ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ రైతులతో మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది.దీంతో ఆయన ఆందోళన విరమించాలని హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడెం ఇరిగేషన్ ఈఈ ప్రవీణ్ ఏఈతో మాట్లాడి ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయాలని చెప్పడంతో, రైతులు శాంతించారు. ఈ ఆందోళనలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)