Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరెంట్ పాపం అధికార్లపై నెపం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Chief Minister Revanth Reddy blamed government officials for the ongoing power crisis in Hyderabad and Telangana, holding a review meeting to demand answers for the electricity shortages. He criticized the administration's neglect regarding the El Nino weather conditions and failed coal supply, threatening to suspend top officials if the crisis is not resolved.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి కొత్త తెరలేపారు. విద్యుత్తు సంక్షోభానికి అధికారులను బాధ్యులను చేస్తూ, ప్రజలముందు తన తప్పేమీలేదని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్ నినోతో ఈ ఏడాది గడ్డు పరిస్థితులు తలెత్తే ప్రమాదమున్నదని ఆరు నెలల ముందే తెలిసినా సర్కార్ పట్టించుకోలేదు. నదులు నిండుగా పారుతున్నా నీటిని ఎత్తిపోయలేదు. కరెంట్ ఉత్పత్తిపైనా దృష్టి పెట్టలేదు.
సర్కార్ నిర్లక్ష్యం ఫలితాన్ని ఇప్పుడు ప్రజలు అనుభవించాల్సి వస్తున్నది. నీళ్లు లేక పంటలు ఎండుముఖం పట్టాయి. ఎండాకాలం రాకముందే కరెంట్ కోతలతో ప్రజలు సతమతమవుతున్నారు. బొగ్గు సరఫరా లేక పవర్ప్లాంట్లు సామర్థ్యం మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. సంక్షోభం ముందురుతుండడంతో అధికారులపై సీఎం చిందులు తొక్కుతున్నారు. తప్పంతా వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్తు సంక్షోభం, వర్షాభావ పరిస్థితులపై బుధవారం సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయాలపై మండిపడ్డారు. విద్యుత్తు సరఫరా సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో ఎందుకు మార్పు…