Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Karepalli | విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపునకు చర్యలు తీసుకోవాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కారేపల్లిలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి మంగళవారం సింగరేణి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యా ప్రమాణాల పెంపు మరియు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదలపై పరిశీలన చేశారు.
ఆయన ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై విద్యార్థుల ప్రగతిపై చర్చించడంతో పాటు అకాడమిక్ గైడెన్స్ అందించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కారేపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ( Learning abilities ) మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి (Pesara Prabhakar Reddy ) మంగళవారం సింగరేణి మండలంలో పర్యటించారు. జిల్లా ఎఫ్ఎల్ఎన్ సెల్ సభ్యులు శ్యామ్‌లాల్, ప్రవీణ్‌లతో కలిసి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యా బోధన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, నిర్దేశించిన విద్యా లక్ష్యాలను సాధించే దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై విద్యార్థుల ప్రగతిపై చర్చించారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, బోధనలో నూతన పద్ధతుల అమలు, పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుదలకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉపాధ్యాయులకు అకాడమిక్ గైడెన్స్ అందించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)