Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Congress party suffered a defeat in the Karnataka Legislative Council (MLC) elections, with the JDS winning the Bangalore Teachers' constituency and the BJP securing the North-East Teachers' constituency and maintaining a lead in two others.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బెంగళూరు, అక్టోబర్ 27 : కర్ణాటక శాసనమండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు తగిలింది. బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో విపక్ష జేడీఎస్ విజయం సాధించింది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించగా, మరో రెండింటిలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఈ నెల 23న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బెంగళూరులో ఉపాధ్యాయ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుట్టన్నపై విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుట్టన్న జేడీఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
ఈసారి అదే నియోజకవర్గంలో ఆయన ఓటమి పాలవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రంగనాథ్, పుట్టన్న ఇద్దరూ వొక్కలిక సామాజిక వర్గానికే చెందినప్పటికీ ఓటర్లు రంగనాథ్వైపే మొగ్గుచూపారు. ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ శశిల్జీ నామోశి.. కాంగ్రెస్ అభ్యర్థి శరణప్ప మత్తూర్పై విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి నామోశి గెలడంం ఇది ఐదోసారి. కల్యాణ కర్ణాటక ప్రాంతంలోని కలబురిగి, దాని పొరుగు జిల్లాలు ఈ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతమైన కలబురిగిలో బీజేపీ విజయం సాధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)